ఈ మెగా సెల్ఫీ చాలా అరుదు గురూ | chiranjeevi selfie with sachin, nagarjuna, | Sakshi
Sakshi News home page

ఈ మెగా సెల్ఫీ చాలా అరుదు గురూ

Jun 1 2016 3:40 PM | Updated on Jul 15 2019 9:21 PM

ఈ మెగా సెల్ఫీ చాలా అరుదు గురూ - Sakshi

ఈ మెగా సెల్ఫీ చాలా అరుదు గురూ

ఒక సాధారణ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటేనే ఒక వార్తగా నిలుస్తుంది. అలాంటిది ఓ ఐదుగురు ప్రముఖులు ఓ చోట చేరి సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది.

తిరుపతి: ఒక సాధారణ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటేనే ఒక వార్తగా నిలుస్తుంది. అలాంటిది ఓ ఐదుగురు ప్రముఖులు ఓ చోట చేరి సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ పట్టరాని సంతోషంతో.. ఇంకా ఆసక్తిగా చెప్పాలంటే ఒకే రకమైన వస్త్రాలు వేసుకొని.. ఎవరి మొఖంలో నవ్వుచూసినా అదే పరిమాణంలో ఉండి.. ఈ అరుదైన సెల్ఫీ తిరుపతిలో ఆవిష్కృతమైంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ చెరిగిపోని చరిత్రను లిఖించుకున్న ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి, నట సామ్రాట్ అక్కినేని నాగార్జున, గీతా ఆర్ట్స్ సారధి అల్లు అరవింద్.. వీళ్లందరికీ ఒక్కసారిగా అదనపు రంగు అద్దినట్లుగా మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, వ్యాపార ప్రముఖుడు నిమ్మగడ్డ ప్రసాద్ కలిసి ఈ స్వీయ చిత్రాన్ని తీసుకున్నారు. బయటకు వచ్చిన ఈ ఫొటోను చూసిన వారంతా కూడా వావ్ వాట్ ఏ సెల్ఫీ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement