ఛలో రాజమండ్రి

చిత్రబృందంతో కలసి రాజమండ్రిలో ల్యాండ్ అవడానికి స్కెచ్ గీస్తున్నారు కొరటాల శివ. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిచాలనుకుంటున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను రాజమండ్రిలో చిత్రీకరించాలనుకుంటున్నారట. అక్కడ లొకేషన్స్ వెతికే పనిలో ఉందట యూనిట్. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి