మెగా దీపావళి... ఆనందకేళి | chiranjeevi family diwali celebration | Sakshi
Sakshi News home page

మెగా దీపావళి... ఆనందకేళి

Nov 1 2016 8:44 AM | Updated on Jul 25 2018 3:13 PM

మెగా దీపావళి... ఆనందకేళి - Sakshi

మెగా దీపావళి... ఆనందకేళి

మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. పండుగ రోజును కుటుంబ సభ్యుల మధ్య గడిపారు. మెగా హీరోలంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీపావళి వేడుకలు జరుపుకునేందుకు మెగా హీరోలు అందరూ ఒక్కచోట చేరారు. వీరంతా కలిసివున్న ఫొటో బయటకు విడుదల చేయడంతో మెగా అభిమానులకు పండగ సంతోషం రెట్టిపయింది.

మెగా హీరోయిన్, నాగబాబు తనయ నిహారిక కూడా పెద్దనాన్న చిరంజీవితో కలిసి ఫొటో దిగింది. అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, నాగబాబు, వైష్టవ్ తేజ్.. చిరంజీవి చుట్టూ చేరి ఫొటోకు ఫోజుయిచ్చారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా, ప్రస్తుతం చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement