నిర్మాతగా సుష్మిత

Chiranjeevi Daughter Sushmita Konidela Turns Producer - Sakshi

‘రంగస్థలం, సైరా నరసింహారెడ్డి’ సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్‌ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల నిర్మాతగా మారారు. భర్త విష్ణుప్రసాద్‌తో కలసి ఆమె ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. విష్ణు ప్రసాద్, సుష్మితాలతో కలిసి జీ5 సంస్థ ఓ వెబ్‌ సిరీస్‌ని నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు.

‘ఓయ్‌’ ఫేమ్‌ ఆనంద్‌ రంగా దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో ప్రకాష్‌ రాజ్, సంపత్‌ రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుష్మితా కొణిదెల మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్‌ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్‌ డ్రామాగా ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లోని ఓ పోలీస్, కొంతమంది కరుడుగట్టిన నేరస్తుల కథల ఆధారంగా ఈ సిరీస్‌ ఉంటుంది. మా గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో నిర్మిస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ కోసం ఓటీటీ వేదిక ‘జీ5’తో అసోసియేట్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సిరీస్‌ షూటింగ్‌ జరుగుతోంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top