ఉగాది కానుక

chiranjeevi and koratala new movie released on 25 march 2020 - Sakshi

షూటింగ్‌ ఇంకా షురూ చేయలేదు. కానీ ప్రణాళిక మాత్రం పక్కాగా సిద్ధం చేస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ‘సైరా’ తర్వాత కొరటాల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాదికి (2020 మార్చి 25) రిలీజ్‌ చేయాలనే ప్లాన్‌లో చిత్రబృందం ఉందని తెలిసింది. సామాజిక అంశాలతో ఈ చిత్రం స్క్రిప్ట్‌ను రూపొందించారట కొరటాల శివ. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అమిత్‌ త్రివేది పేరుని పరిశీలిస్తున్నారట. హీరోయిన్‌ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top