గాయని చిన్మయి వివాహ రిసెప్షన్ | Chinmayi-Rahul Ravindran Wedding Reception | Sakshi
Sakshi News home page

గాయని చిన్మయి వివాహ రిసెప్షన్

May 8 2014 11:54 PM | Updated on Sep 2 2017 7:05 AM

గాయని చిన్మయి వివాహ రిసెప్షన్

గాయని చిన్మయి వివాహ రిసెప్షన్

ప్రముఖ యువ గాయని చిన్మయి, నటుడు రాహుల్ రవీంద్రన్‌ల వివాహ రిసెప్షన్ బుధవారం ఉదయం చెన్నైలో ఘనంగా జరిగింది. తమిళం, తెలుగు, కన్నడం,

 ప్రముఖ యువ గాయని చిన్మయి, నటుడు రాహుల్ రవీంద్రన్‌ల వివాహ రిసెప్షన్ బుధవారం ఉదయం చెన్నైలో ఘనంగా జరిగింది. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో పలు పాటలు పాడి బహుభాషా గాయనిగా పేరు తెచ్చుకున్న చిన్మయి, యువ నటుడు రాహుల్ రవీంద్రన్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల సమ్మతంతో వీరి వివాహం సోమవారం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో నిడారంబరంగా సాగింది. బుధవారం జరిగిన వివాహ రిసెప్షన్‌కు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నటుడు విజయ్, కుటుంబం, కార్తీ, మిర్చి శివ, వివేక్, గాయని పి.సుశీల, దర్శకుడు గౌతమ్ మీనన్, ధరణి, గీత రచయిత వైరముత్తు తదితర ప్రముఖులు ఉండడం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement