రైతు సమస్యలపై చినబాబు పోరు | chinababu july 13 release | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై చినబాబు పోరు

Jul 6 2018 1:44 AM | Updated on Jul 6 2018 1:44 AM

chinababu july 13 release - Sakshi

కార్తీ, సాయేషా

కార్తీ, సాయేషా జంటగా నటించిన చిత్రం ‘చినబాబు’. సత్యరాజ్‌ ముఖ్య పాత్రలో నటించారు. పాండిరాజ్‌ దర్శకత్వంలో  2డి ఎంటరై్టన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్స్‌లో హీరో సూర్య, మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో రైతుల సమస్యలను పాండిరాజ్‌ చక్కగా చర్చించారు. కామెడీ, యాక్షన్‌ కూడా ఉంటుంది. కార్తీ తొలిసారి రైతు పాత్రలో కనిపించబోతున్నారు.

ఇటీవల విడుదలైన టీజర్‌లో కార్తీ చెప్పిన డైలాగ్స్‌ ఆలోచింపచేసేలా ఉన్నాయి. టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. త్వరలో ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయనున్నాం. ఇందులో శత్రు మెయిన్‌ విలన్‌గా నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ప్రియా భవానిశంకర్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: సి.హెచ్‌. సాయికుమార్‌ రెడ్డి, రాజశేఖర్‌ కర్పూర, సుందర పాండియాన్,  సంగీతం: డి.ఇమాన్, కెమెరా: వేల్‌రాజ్‌.

Advertisement
 
Advertisement
Advertisement