అంతఃకరణ శుద్ధితో...

Cheema Prema Madhyalo Bhama Movie updates - Sakshi

అమిత్, ఇందు జంటగా చీమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చీమ ప్రేమ మధ్యలో భామ!’. శ్రీకాంత్‌ శ్రీ అప్పల రాజు దర్శకత్వంలో ఎస్‌ఎన్‌ లక్ష్మీనారాయణ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘‘మా సినిమాకి చీమే హీరో. అంతఃకరణ శుద్ధితో అడుగు ముందుకు వేస్తే ఏదైనా సాధ్యమే, ఎవరేం కావాలనుకున్నా కావచ్చనే అంతర్లీన సందేశంతో ఈ సినిమా రూపొందించాం. ఈ చిత్రం హీరో ప్రభాస్‌గారి అభిమానులకు ప్రత్యేకంగా నచ్చుతుంది.. అది ఎందుకో తెలియాలంటే విడుదల వరకూ ఆగాలి’’ అన్నారు శ్రీకాంత్‌ శ్రీ అప్పలరాజు. ‘‘ఫ్యాంటసీతో కూడిన ప్రేమ కథ ఇది’’ అన్నారు లక్ష్మీనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్‌ లలాని. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top