చీకటిరాజ్యం ట్రైలర్ విడుదల | cheekati rajyam trailer released | Sakshi
Sakshi News home page

చీకటిరాజ్యం ట్రైలర్ విడుదల

Sep 16 2015 6:35 PM | Updated on Sep 3 2017 9:31 AM

చీకటిరాజ్యం ట్రైలర్ విడుదల

చీకటిరాజ్యం ట్రైలర్ విడుదల

కమల్హాసన్, త్రిష జంటగా నటిస్తున్న చీకటిరాజ్యం సినిమా ట్రైలర్ విడుదలైంది.

కమల్హాసన్, త్రిష జంటగా నటిస్తున్న చీకటిరాజ్యం సినిమా ట్రైలర్ విడుదలైంది. 'తూంగవనం' పేరుతో తమిళంలోను, చీకటిరాజ్యంగా తెలుగులోను వస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. త్రిషకు ఇది 50వ సినిమా కావడంతో పలువురు సినీ జనాలు కూడా త్రిషను ట్విట్టర్లో అభినందనలతో ముంచెత్తారు.

అందులోనూ త్రిషను ఈ సినిమాలో డీగ్లామరస్ పాత్రలో చూపించడం, కమల్, త్రిషల మధ్య ఫైటింగ్తో కూడిన పోస్టర్ కూడా విడుదల కావడం.. ఇలాంటి విశేషాలు ఉన్న నేపథ్యంలో ట్రైలర్ కోసం కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.  కమల్కు సన్నిహితుడైన రాజేశ్ ఎం సెల్వ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించాడు. సినిమా ట్రైలర్ లింకును త్రిష ట్వీట్ చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement