సూపర్ స్టార్లతో ఏలేటి సాహసం | Chandrashekar Yeleti ropes in mohanlal, shivarajkumar for next film | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్లతో ఏలేటి సాహసం

Oct 29 2015 9:56 AM | Updated on Sep 3 2017 11:41 AM

రెగ్యులర్ కమర్షియల్ జానర్కు భిన్నంగా కొత్త తరహా సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలను తీస్తూ వస్తున్న...

రెగ్యులర్ కమర్షియల్ జానర్కు భిన్నంగా కొత్త తరహా సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలను తీస్తూ వస్తున్న ఈ డైరెక్టర్, ఇంతవరకు ఒక్క భారీ కమర్షియల్ సక్సెస్ కూడా అందుకోలేకపోయినా, దర్శకుడిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. సాహసం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న చంద్రశేఖర్ ఏలేటి ప్రస్తుతం ఓ మల్టీ లింగ్యువల్ సినిమాకు రెడీ అవుతున్నాడు.

వారాహి చలనచిత్ర బ్యానర్పై సాయి కొరపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్రోల్లో నటిస్తుండగా చాలాకాలం తరువాత గౌతమి హీరోయిన్గా నటిస్తుంది. తెలుగు, తమిళ్తో పాటు ఈ సినిమాను కన్నడలో కూడా తెరకెక్కించాలని భావిస్తున్న ఏలేటి, కన్నడ వర్షన్లో హీరోగా సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ను ఒప్పించాలని ట్రై చేస్తున్నాడు. బాలీవుడ్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement