నటుడిగా మరో మెట్టు పైకి... | chalo Teaser Release On 16th Nov | Sakshi
Sakshi News home page

నటుడిగా మరో మెట్టు పైకి...

Nov 16 2017 12:14 AM | Updated on Aug 3 2019 12:30 PM

chalo Teaser Release On 16th Nov - Sakshi

ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు కళాశాల ప్రేమకథ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘ఛలో’. నాగశౌర్య, రష్మికా మండన్న జంటగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శంకర్‌ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఈ శనివారం రిలీజ్‌ చేస్తున్నారు. ఉషా ముల్పూరి మాట్లాడుతూ– ‘‘ఛలో’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కి ఇండస్ట్రీ, ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ రావడంతో ఫుల్‌ హ్యాపీగా ఉన్నాం. మంచి కథను కమర్షియాలిటీ మిస్‌ కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పారు వెంకీ. నాగశౌర్య కెరీర్‌లోనే  బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం.

డిసెంబర్‌ 29న సినిమా విడుదల చేస్తాం’’  అన్నారు. ‘‘నటుడిగా నాగశౌర్య అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన్ని ‘ఛలో’ సినిమాలో వైవిధ్యంగా చూపించబోతున్నాం. నటుడిగా తనను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఈ నెల 18న వచ్చే టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరుగుతాయి’’ అన్నారు  వెంకీ కుడుముల. ‘‘దర్శకుడు వెంకీ కథను చాలా బాగా హ్యాండిల్‌ చేశారు. నాగశౌర్యకు మంచి కమర్షియల్‌ హిట్‌ సినిమా అవుతుందని దీమాగా చెబుతున్నాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు  జరుగుతున్నాయి. డిసెంబర్‌ 29న సినిమాని గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నాం’’ అని శంకర్‌ప్రసాద్‌ ముల్పూరి అన్నారు. ఈ సినిమాకి సంగీతం: సాగర్‌ మహతి, కెమెరా: సాయి శ్రీరామ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement