ఖైదీతో ఆటా పాటా? | Catherine Item Song in Chiranjeevi 150th Movie Khaidi No 150 | Sakshi
Sakshi News home page

ఖైదీతో ఆటా పాటా?

Sep 7 2016 11:43 PM | Updated on Sep 4 2017 12:33 PM

ఖైదీతో ఆటా పాటా?

ఖైదీతో ఆటా పాటా?

దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. వీవీ వినాయక్ దర్శకత్వంలో శ్రీమతి సురేఖ కొణిదెల

దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. వీవీ వినాయక్ దర్శకత్వంలో శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరిన్ ఐటెమ్ సాంగ్ చేయనున్నారని తాజా సమాచారం. వాస్తవానికి చిరూ సరసన తమన్నా ఐటెమ్ సాంగ్ చేయనున్నారని ఓ వార్త వినిపించింది.
 
 ‘తమన్నాతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది’ అంటూ గతంలో చిరు ఓ ఫంక్షన్‌లో చెప్పారు కూడా. దాంతో అందరూ ఐటెమ్ సాంగ్ చేసే అవకాశం తమన్నాకే ఉంటుందనుకున్నారు. కానీ, ఎవరి ఊహలకూ అందని విధంగా సీన్లోకి సడెన్‌గా కేథరిన్ పేరు వచ్చింది. త్వరలో చిరు, కేథరిన్ పాల్గొనగా హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో పాటను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement