అభిమాని అత్యుత్సాహం : స్టార్ హీరోపై కేసు | case filled against tamil star hero vijay | Sakshi
Sakshi News home page

అభిమాని అత్యుత్సాహం : స్టార్ హీరోపై కేసు

May 13 2017 1:30 PM | Updated on Sep 5 2017 11:05 AM

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మితిమీరిన అభిమానం ఒక్కోసారి స్టార్స్ హీరోలకు తలనొప్పిగా మారుతుంటుంది. ముఖ్యంగా

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మితిమీరిన అభిమానం ఒక్కోసారి స్టార్స్ హీరోలకు తలనొప్పిగా మారుతుంటుంది. ముఖ్యంగా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలు చాలా సార్లు ఆ హీరోలు ఇబ్బంది పెట్టాయి. తాజాగా ఇలయదళపతి అభిమాని తన ఫేవరెట్ హీరో ఫోటోతో డిజైన్ చేసిన ఓ పోస్టర్ విజయ్పై కేసు నమోదయ్యేలా చేసింది. విజయ్ వీరాభిమాని అయిన ఓ యువకుడు తన ఫేవరెట్ హీరో త్రిశూలం పట్టుకున్నట్టుగా ఓ పోస్టర్ను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో వైరల్ కావటంతో అందరి దృష్టి పోస్టర్పై పడింది.

అయితే ఈ ఫోటోలో విజయ్ షూస్ వేసుకొని త్రిశూలం పట్టుకోవడం పై హిందూ మక్కల్ మున్నని పార్టీ అభ్యంతరం తెలిపింది. షూస్ వేసుకొని త్రిశూలం పట్టుకోవటం హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం అని.. అలా చేసి విజయ్ తమ మనోభావాలను దెబ్బతీశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా విజయ్పై కేసు నమోదయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement