ఆమె నిశ్చితార్థ ఉంగరం దొరికింది! | Cab driver returns Vikram’s daughter lost ring | Sakshi
Sakshi News home page

ఆమె నిశ్చితార్థ ఉంగరం దొరికింది!

Aug 14 2016 5:55 PM | Updated on Aug 14 2018 3:14 PM

ఆమె నిశ్చితార్థ ఉంగరం దొరికింది! - Sakshi

ఆమె నిశ్చితార్థ ఉంగరం దొరికింది!

విలక్షణ నటుడు విక్రమ్ కుమార్తె అక్షిత పోగొట్టుకున్న ఆమె నిశ్చితార్థ ఉంగరం ఎట్టకేలకు దొరికింది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మునిమనవడు మను రంజిత్తో.. అక్షిత నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

విలక్షణ నటుడు విక్రమ్ కుమార్తె అక్షిత పోగొట్టుకున్న ఆమె నిశ్చితార్థ ఉంగరం ఎట్టకేలకు దొరికింది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మునిమనవడు మను రంజిత్తో.. అక్షిత నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే స్నేహితులతో కలిసి చైన్నైలోని ఓ ఐస్క్రీమ్ పార్లర్కు వెళ్లిన అక్షిత.. చేతి వేలికి ఉంగరం లేకపోవడం గమనించింది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించడం, అనుమానితులను ప్రశ్నించడంలాంటివి చేసినప్పటికీ ఉంగరం జాడ తెలియలేదు.

అయితే తాజాగా లక్ష్మణన్ అనే ఓ క్యాబ్ డ్రైవర్.. అక్షిత ఉంగరాన్ని తెచ్చి ఇచ్చినట్లు తెలుస్తోంది. పోయిన ఉంగరం.. నిశ్చితార్థ ఉంగరం అని వార్తా పత్రికల్లో చదివిన లక్ష్మణన్, తనకు దొరికిన ఉంగరం అదేనని తెలుసుకుని వెంటనే విక్రమ్ ఫ్యామిలీకి అందజేసినట్లు సమాచారం. గాంధీ ఫౌండేషన్లో లక్ష్మణన్ సభ్యుడిగా ఉన్నాడు. కాగా ఆ ఉంగరం విలువ రూ.12 లక్షల పైమాటేనట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement