వైకుంఠపురములో బుట్టబొమ్మ

butta bomma song shooting from Ala vaikunta puramlo - Sakshi

‘బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూ కుంటివే’ అని పాడుతున్నారు అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ‘అల..వైకుంఠపురములో...’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో ఈ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ అనే పాటను అల్లు అర్జున్‌ , పూజలపై చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఈ పాట కోసం రంగు రంగల పూలను భారీగా వినియోగిస్తున్నారట. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను అర్మాన్‌మాలిక్‌ పాడారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతదర్శకుడు. సుశాంత్, నివేతా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top