ఇది సమష్టి విజయం | Brochevarevarura Thanks Meet | Sakshi
Sakshi News home page

ఇది సమష్టి విజయం

Jul 3 2019 2:31 AM | Updated on Jul 3 2019 5:02 AM

Brochevarevarura Thanks Meet - Sakshi

ప్రియదర్శి, శ్రీవిష్ణు, వివేక్‌ ఆత్రేయ, నివేదా థామస్‌..

‘‘బ్రోచేవారెవరురా’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇందులో ప్రతి ఒక్కరూ బాగా చేశారు. ఇది మా టీమ్‌ సమష్టి కృషితో సాధించిన విజయం’’ అన్నారు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. శ్రీవిష్ణు, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. సత్యదేవ్, నివేతా పేతురాజ్, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. విజయ్‌కుమార్‌ మన్యం నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ‘‘సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది’’ అని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘థాంక్స్‌ మీట్‌’లో విజయ్‌కుమార్‌ మన్యం మాట్లాడుతూ –‘‘మా సినిమా చూసి ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కేటీఆర్‌గారు, సురేశ్‌బాబుగారు, వెంకటేశ్‌గారు, నానిగారు, అనిల్‌ రావిపూడి, తరుణ్‌ భాస్కర్, రామ్‌.. ఇలా మా సినిమా గురించి మంచి మాటలు చెప్పిన అందరికీ థ్యాంక్స్‌. మంచి కలెక్షన్లు, మంచి ఓపెనింగ్స్‌ రావడానికి మంచి రివ్యూలు దోహదపడ్డాయి’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసి సురేష్‌బాబుగారు బావుందన్నారు. ప్రీ రిలీజ్‌కి రామ్‌గారు, రోహిత్‌గారు వచ్చారు. దానివల్ల అందరికీ రీచ్‌ అయింది. ముందు రోజు నానిగారు చూసి బావుందని చెప్పడంతో అందరూ థియేటర్లకు వచ్చి మెచ్చుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement