భర్త సర్‌ప్రైజ్.. చివరిక్షణాల్లో శ్రీదేవి ఇలా! | Boney Kapoor Found his wife sridevi situation in Bathtub | Sakshi
Sakshi News home page

భర్త సర్‌ప్రైజ్.. చివరిక్షణాల్లో శ్రీదేవి ఇలా!

Feb 26 2018 11:08 AM | Updated on Feb 26 2018 4:21 PM

Boney Kapoor Found his wife sridevi situation in Bathtub - Sakshi

భర్త బోనీ కపూర్‌తో నటి శ్రీదేవి

దుబాయ్ : తన మేనల్లుడు మోహిత్‌ మార్వా వివాహం కోసం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీతో కలసి దుబాయ్‌కి వెళ్లిన ‘అతిలోక సుందరి’ శ్రీదేవి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం మొదట దుబాయ్ వెళ్లిన బోనీకపూర్ ఓ పని నిమిత్తం మళ్లీ ముంబైకి వచ్చేశారు. భార్య శ్రీదేవికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఆమెకు సడన్ సర్‌ప్రైజ్ ఇద్దామని శనివారం మళ్లీ దుబాయ్‌కి వెళ్లిన బోనీకపూర్ మరికొన్ని గంటల్లో తన జీవితంలో పెద్ద విషాదం చోటుచేసుకుంటుందని ఊహించలేకపోయారు.

అసలేం జరిగిందంటే..
వేడుకల్లో పాల్గొనేందుకు బోనీకపూర్ దుబాయ్‌కి రెండోసారి శనివారం సాయంత్రం వెళ్లారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బోనీ, భార్య శ్రీదేవిని కలుసుకుని సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అరగంట సమయం వీరు మాట్లాడుకున్నారు. అనంతరం రాత్రి పెళ్లి విందుకు భర్త బోనీతో కలిసి శ్రీదేవి హాజరుకావాలనుకున్నారు. ఈ క్రమంలో జుమిరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ రూములో స్నానాలగదికి వెళ్లిన శ్రీదేవి ఎంతసేపయినా బయటకు రాకపోవడంతో బోనీకపూర్ డోర్ కొట్టగా ఎలాంటి స్పందన రాలేదు. ఎలాగోలా కష్టపడి డోర్ ఓపెన్ చేసిన బోనీకపూర్ షాక్‌కు గురయ్యారు. భార్య శ్రీదేవి నీండా నీళ్లున్న బాత్రూమ్ టబ్‌లో నిర్జీవంగా పడి ఉన్నట్లు గుర్తించారు. లేస్తుందని ఎంతో ఆశగా పలుమార్లు కదిలించి చూసిన శ్రీదేవిలో ఎలాంటి చలనం రాలేదు. ఆందోళనకు గురైన బోనీకపూర్ తన స్నేహితుడికి విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత దాదాపు 9 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫోన్ చేసి తన భార్య శ్రీదేవి మరణించినట్లు పోలీసులకు చెప్పినట్లు దుబాయ్ లోని ప్రముఖ మీడియా ‘ఖలీజ్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement