బొమ్మరిల్లు భాస్కర్కు మరో ఛాన్స్ | Bommarillu Bhasker Movie with geetha arts | Sakshi
Sakshi News home page

బొమ్మరిల్లు భాస్కర్కు మరో ఛాన్స్

Aug 2 2016 1:05 PM | Updated on Sep 4 2017 7:30 AM

బొమ్మరిల్లు భాస్కర్కు మరో ఛాన్స్

బొమ్మరిల్లు భాస్కర్కు మరో ఛాన్స్

బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భాస్కర్, ఆ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా ఆరెంజ్ సినిమాతో భారీ ప్లాప్ రావడంతో భాస్కర్...

బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భాస్కర్, ఆ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా ఆరెంజ్ సినిమాతో భారీ ప్లాప్ రావడంతో భాస్కర్ కెరీర్ తిరగబడింది. ఆ తరువాత ఎన్నో ఆశలతో తెరకెక్కించిన ఒంగోళుగిత్తకు కూడా ఫ్లాప్ టాక్ రావటంతో తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.

లాంగ్ గ్యాప్ తీసుకున్న భాస్కర్, ఇటీవల బెంగళూర్ డేస్ తమిళ రీమేక్తో మరోసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. మరోసారి తెలుగులో దర్శకుడిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయాత్నాలు ప్రారంభించిన భాస్కర్కు మెగా ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇస్తున్నాడట. ఇప్పటికే మెగా హీరోస్తో పరుగు, ఆరెంజ్ సినిమాలను తెరకెక్కించిన భాస్కర్, ఈ సారి అల్లు అరవింద్ నిర్మాణంలో సినిమా చేయనున్నాడు.

ఇప్పటికే లైన్ ఓకె చేసిన అరవింద్, పూర్తి కథతో రమ్మన్నాడట. కథ రెడీ అయ్యాక నటీనటుల ఎంపిక జరుగనుంది. అయితే మరోసారి మెగా హీరోతోనే సినిమా చేస్తాడా..? లేక.. లో బడ్జెట్లో చిన్న హీరోతో సినిమాను చేస్తారా..? అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement