ఫైనల్‌గా సినిమా పట్టాడు..! | Bommarillu Bhaskar Movie with Gopichand | Sakshi
Sakshi News home page

Mar 13 2018 11:40 AM | Updated on Mar 13 2018 12:32 PM

Bommarillu Bhaskar Movie with Gopichand - Sakshi

దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌

తొలి సినిమా బొమ్మరిల్లుతోనే బ్లాక్‌ బస్టర్ సక్సెస్‌ సాధించిన యువ దర్శకుడు భాస్కర్‌, తరువాత ఒక్క ఫ్లాప్‌తో కష్టాల్లో పడ్డాడు. ఆరెంజ్‌ సినిమాతో డిజాస్టర్‌ రావటంతో భాస్కర్‌ కు ఛాన్స్‌ ఇచ్చే వారే కరువయ్యారు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఓ తమిళ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్నా వర్క్‌ అవుట్ కాలేదు. దీంతో భాస్కర్‌కు మరోసారి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లాంగ్‌ గ్యాప్ తరువాత ఈ యువ దర్శకుడిగా ఓ ఛాన్స్‌ వచ్చింది. తాజాగా భాస్కర్‌.. గోపిచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు అల్లు అరవింద్‌, సురేష్‌ బాబుల నిర్మాణంలోనూ సినిమాలు చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాడు బొమ్మరిల్లు భాస్కర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement