ఫ్లాప్‌ డైరెక్టర్‌తో వెంకీ..! | Bommarillu Bhaskar To Direct Venkatesh | Sakshi
Sakshi News home page

Sep 25 2018 12:59 PM | Updated on Sep 25 2018 12:59 PM

Bommarillu Bhaskar To Direct Venkatesh - Sakshi

ఇటీవల సినిమా ఎంపికలో కాస్త స్లో అయిన వెంకటేష్‌ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో కలిసి ఎఫ్‌2 సినిమాలో నటిస్తున్న ఈ సీనియర్‌ స్టార్‌ త్వరలో నాగచైతన్యతో వెంకీ మామ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది.

తాజాగా వెంకటేష్‌ హీరోగా మరో సినిమా తెరకెక్కనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మరిల్లు సినిమాతో హాట్‌ టాపిక్‌గా మారిన దర్శకుడు భాస్కర్‌ దర్శకత్వంలో నటించేందుకు వెంకీ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. బొమ్మరిల్లు తరువాత పరుగుతో పరవాలేదనిపించినా ఆరెంజ్‌, ఒంగోలు గిత్త సినిమాలు డిజాస్టర్‌లుగా నిలిచాయి. దీంతో భాస్కర్‌ కెరీర్‌ కష్టాల్లో పడింది.

ఇటీవల బెంగళూర్‌ డేస్‌ సినిమాను కోలీవుడ్‌లో రీమేక్‌ చేసినా వర్క్‌ అవుట్ కాలేదు. దీంతో మరోసారి లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న భాస్కర్, వెంకటేష్‌కు ఓ లైన్‌ వినిపించారట. వెంకీకి ఆ లైన్‌ నచ్చటంతో ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ చేయమన్నారన్న టాక్‌ వినిపిస్తోంది. వెంకీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో భాస్కర్ సినిమా ఓకె అయిన సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా సమయమే పడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement