వాళ్ల బాధను పంచుకోవటం ఆనందంగా ఉంది : సల్మాన్‌ | Bollywood Super Star Salman Khan Whips Himself | Sakshi
Sakshi News home page

వాళ్ల బాధను పంచుకోవటం ఆనందంగా ఉంది : సల్మాన్‌

Aug 31 2019 3:53 PM | Updated on Aug 31 2019 3:53 PM

Bollywood Super Star Salman Khan Whips Himself - Sakshi

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఓ ఆసక్తికర వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పోతురాజు వేషదారణలో ఉన్న కొంతమంది వ్యక్తులను సల్మాన్‌ కలిసి వీడియో అది. వీడియోలో సల్మాన్‌ వారితో సరదాగా ముచ్చటించటంతో పాటు వారి కొరడాతో తాను కూడా కొట్టుకున్నాడు. సల్మాన్‌ లాంటి సూపర్‌ స్టార్‌ తమతో కొంత సమయం గడపటంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన సల్మాన్‌ ‘వారి అనుభూతుల్ని, బాధను పంచుకోవటం ఆనందంగా ఉంది. ఇది మీపై మీరు ప్రయత్నించకండి. మరొకరి మీద కూడా ప్రయోగించకండి’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు సల్మాన్‌. ప్రస్తుతం సల్మాన్, ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దబాంగ్ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement