ప్రముఖ గాయకుడు కన్నుమూత

ముంబై : టీవీ నటి రోమా బాలి భర్త, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు నితిన్ బాలి కన్నుమూశారు. నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు పాలైన నితిన్, ఈ రోజు ఉదయం చనిపోయారు. మాలద్ నుంచి బొరివిల్లిలో ఉన్న తన ఇంటికి వెళ్తున్న క్రమంలో, గాయకుడి కారు డివైండర్‌ను ఢీకొట్టింది. వెంటనే ఆయన్ని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత తలకు, ముఖానికి తగిలిన గాయాలకు చికిత్స తీసుకున్నారు. ఆ అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఇంటికి వెళ్లిన తర్వాత, ఆయన మృత్యువాత పట్టారు.
ఇంటికి చేరుకున్న వెంటనే నితిన్ రక్తపు వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తపోటు తీవ్ర స్థాయికి చేరిందని, ఆయన ఇంట్లో కుప్పకూలిపోవడమే ఒక్కసారిగా హార్ట్ రేటు పడిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, ప్రాణాలు మాత్రం దక్కించుకోలేకపోయారు. గాయకుడి మేనకోడలు ఈ విషయాన్ని ధృవీకరించారు. నితిన్ అంత్యక్రియలు రేపు జరిగే అవకాశమున్నాయి. కాగా, నితిన్ 1990 కాలంలో గాయకుడిగా బాగా ప్రసిద్ధి పొందారు. ‘నీలే నీలే అంబర్ పర్’ అనే క్లాసిక్ పాటతో ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఈ పాట ఆల్‌టైమ్ చార్ట్‌బాస్టర్స్‌గా నిలిచింది. ఈ పాట బ్లాక్ అండ్ వైట్ వీడియోలో రూపొందింది. ఆరుకు పైగా ఆల్బమ్స్ చేశారు. అవన్నీ చార్ట్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ‘నా జానే’తో మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే నితిన్ చాలా లో-ప్రొఫైల్ నిర్వహించేవారు. 2012లోనే మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నారు.