బాలయ్య తల్లిగా బాలీవుడ్ బ్యూటీ? | Bollywood legendary heroine in bala krishna 100th film | Sakshi
Sakshi News home page

బాలయ్య తల్లిగా బాలీవుడ్ బ్యూటీ?

Mar 31 2016 1:49 PM | Updated on Sep 3 2017 8:57 PM

బాలయ్య తల్లిగా బాలీవుడ్ బ్యూటీ?

బాలయ్య తల్లిగా బాలీవుడ్ బ్యూటీ?

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దర్శకులుగా చాలామంది పేర్లు వినిపించిన ఫైనల్గా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్కే బాలయ్య ఓటు వేశారన్న టాక్ వినిపిస్తోంది. అఫీషియల్గా ప్రకటించకపోయినా, క్రిష్ డైరెక్షన్లో బాలయ్య ఓ చారిత్రక చిత్రం చేస్తారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. శాతవాహనరాజు గౌతమీ పుత్ర శాతకర్ణి జీవితచరిత్రను యోధుడు పేరుతో భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు క్రిష్.

ఈ సినిమా కోసం ఇంట్రస్టింగ్ టీంను కూడా సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కథాపరంగా సినిమాలో తల్లి పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే ఆ పాత్రకు స్టార్ ఇమేజ్ ఉన్న నటి అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. బాలయ్య తల్లి పాత్ర కాబట్టి సీనియర్ నటీమణి అయితే కరెక్ట్ అని, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమమాలినిని సంప్రదించారట. ఆమె అంగీకరిస్తే రాజమాత గౌతమి పాత్రకు హుందాతనంతో పాటు, గ్లామర్ కూడా యాడ్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించిన హేమ, తెలుగు సినిమాలో అది కూడా బాలయ్య లాంటి సీనియర్ హీరోకి తల్లి పాత్రలో నటించడానికి అంగీకరిస్తుందో.. లేదో..? చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement