లండన్‌ యువతితో హీరో వివాహం! | bollywood hero Ranbir Kapoor to marry a London girl? | Sakshi
Sakshi News home page

లండన్‌ యువతితో హీరో వివాహం!

May 11 2017 12:02 PM | Updated on Sep 5 2017 10:56 AM

లండన్‌ యువతితో హీరో వివాహం!

లండన్‌ యువతితో హీరో వివాహం!

హీరో రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లివార్త ఇప్పుడు బాలీవుడ్ లో చక్కెర్లు కొడుతోంది.

హీరో రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లివార్త ఇప్పుడు బాలీవుడ్లో చక్కెర్లు కొడుతోంది. రణ్‌బీర్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట.లండన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లాడబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే రణబీర్‌ తన తల్లి నీతూతో కలిసి వెళ్లి పెళ్లికూతుర్ని కూడా చూసివచ్చాడట.  ఈ విషయాన్ని నీతూ సన్నిహితులు వెల్లడించారు. యువతి కుటుంబసభ్యులతో కూడా చర్చలు కొనసాగినట్లు తెలిపారు. కాగా చిత్ర పరిశ్రమకు చెందినవారిని తన కోడలుగా చేసుకునేందుకు రణబీర్‌ తల్లికి మొదటి నుంచి ఇష్టం లేదు.

రణ్‌బీర్‌ గతంలో హీరోయిన్లు దీపిక పదుకొనె, కత్రినా కైఫ్‌లతో ప్రేమ వ్యవహారానికి కూడా ఆమె విముఖంగానే ఉన్నారు. అయితే రణబీర్‌ దీపికాతో బ్రేక్‌ అప్‌ చెప్పిన తర్వాత కత్రీనా కైఫ్‌తో లవ్‌ స్టోరీ పెళ్లివరకూ వెళ్లింది. వీళ్లిద్దరూ ముంబైలోని ఓ ఫ్లాట్‌లో పెళ్లికి ముందే సహజీవనం కూడా చేశారు. అయితే ఏమైందో ఏమో అంతలోనే ఇద్దరు బ్రేకప్ అయ్యారు. అప్పటి నుంచి రణ్‌బీర్‌ సింగిల్‌గానే ఉంటున్నాడు. దీంతో అతడి తల్లి కొడుకుని త్వరలోనే ఓ ఇంటివాడిని చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే కోడలు కోసం వేట మొదలుపెట్టారు. దీంతో త్వరలోనే రణ్‌బీర్‌ పెళ్లి చర్చలు ఓ కొలిక్కి రానున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement