చల్లగా.. చిల్‌గా..

bollywood actress summer vacations tour - Sakshi

సమ్మర్‌ స్టార్ట్‌ అయ్యింది. ఎండ తీవ్రత పెరిగింది. దీంతో బాలీవుడ్‌ తారలు కొందరు వెకేషన్‌ కోసం మ్యాప్‌ను ముందు వేసుకుని నచ్చిన ప్లేస్‌ని సెలెక్ట్‌ చేసుకుంటున్నారు. ఫారిన్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేసి ఎయిర్‌పోర్టుకు దారి వెతుక్కుంటున్నారు. సూట్‌కేస్‌లు సర్దుకుని చల్లని ప్రదేశాల్లో ల్యాండైపోతున్నారు. కొందరు విదేశాలను చుట్టొచ్చేశారు. కొందరు అక్కడ చిల్‌ అవుతున్నారు. ఐశ్వర్యారాయ్, షాహిద్‌ కపూర్, ఫర్హాన్‌ అక్తర్, సారా అలీఖాన్‌లు ఆల్రెడీ సర్దుకున్న సూట్‌కేసులను ఫారిన్‌లో ఓపెన్‌ చేసి, చిల్‌ అయి వచ్చేశారు. మరి.. వీళ్లంతా ఎక్కడెక్కడి వెళ్లారో తెలుసుకోవాలంటే మాత్రం మ్యాటర్‌ కంటిన్యూ చేయండి.

భర్త అభిషేక్‌ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులు వెళ్లారు ఐశ్వర్యారాయ్‌. అక్కడికే వెళ్లొచ్చారు కత్రినాకైఫ్, కృతీసనన్, మలైకా అరోరాఖాన్‌. ‘గుడ్‌న్యూస్‌’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసిన గుడ్‌మూడ్‌లో లండన్‌ తిరిగొచ్చారు కరీనాకపూర్‌. భార్య మీరా కపూర్‌తో కలిసి షాహిద్‌ కపూర్‌ స్పెయిన్‌లో హాలీడే టైమ్‌ ఎంజాయ్‌ చేశారు. జార్జియాలో జాలీగా గడిపొచ్చిన కొత్త దంపతులు ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనాస్‌ ప్రస్తుతం ముంబైలో ఫ్యామిలీ టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ లేటెస్ట్‌ లవ్‌బర్డ్స్‌ ఫర్హాన్‌అక్తర్, షిబాని దండేకర్‌ మెక్సికోలో చిల్‌ అయ్యారు.

మాజీ మిస్‌ ఇండియా సుస్మితాసేన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ (బాలీవుడ్‌ మీడియా అలానే చెబుతోంది) రోహ్మన్‌తో కలిసి న్యూయార్క్‌లో ప్రేమ పరుగు తీశారు. ఇక సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ న్యూయార్క్‌లో వాలిపోయారు. స్నేహితులతో కలిసి న్యూయార్క్‌ని రౌండప్‌ చేసే పనిలో ఉన్నారు. మరి కొందరు హీరోయిన్లు తమ సినిమాల షూటింగ్‌ డేట్స్‌ను చూసుకుని ఫారిన్‌ ట్రిప్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. మరి.. ఇంకా ఎంతమంది స్టార్స్‌ చల్లని ప్రదేశాల్లో చిల్‌ కావడానికి వెళతారో చూడాలి.

 సారా అలీఖాన్,  స్నేహితులతో కరీనా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top