ఎవర్ గ్రీన్ మన్మథుడికి బర్త్ డే విషెస్ | Birthday wishes to King Nagarjuna | Sakshi
Sakshi News home page

ఎవర్ గ్రీన్ మన్మథుడికి బర్త్ డే విషెస్

Aug 29 2017 10:23 AM | Updated on Jul 15 2019 9:21 PM

ఎవర్ గ్రీన్ మన్మథుడికి బర్త్ డే విషెస్ - Sakshi

ఎవర్ గ్రీన్ మన్మథుడికి బర్త్ డే విషెస్

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు పుట్టిన రోజు

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజు గారి గది 2 షూటింగ్ లో ఉన్న నాగ్ కు పుట్టిన రోజు కానుకగా చిత్రయూనిట్ టీజర్ ను రిలీజ్ చేయనుంది.

నాగార్జున హీరో భక్తిరస చిత్రాలను అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. 'మా ఎవర్ గ్రీన్ గ్రీకువీరుడు, ఏ పాత్రనైనా చేయగల ఘరానా బుల్లోడు, అందరిని మెప్పించగల రామదాసు, నాగార్జున కి జన్మదిన శుభాకాంక్షలు'  అంటూ ట్వీట్ చేశారు. నాగ్ వెండితెరకు పరిచయం చేసిన యోగా బ్యూటి అనుష్క, మంచు హీరోలు మనోజ్, విష్ణులతో పాటు ప్రస్తుతం నాగ్ హీరోగా తెరకెక్కుతున్న రాజు గారి గది 2 నిర్మాతలు కూడా సోషల్ ట్విట్టర్ ఫేస్ బుక్ ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement