బిగ్‌బాస్‌లో ఈరోజంతా ‘కెవ్వు కేకే’నా? | Bigg Boss Season 2 Telugu Show Updates | Sakshi
Sakshi News home page

Jun 28 2018 3:51 PM | Updated on Jul 18 2019 1:45 PM

Bigg Boss Season 2 Telugu Show Updates - Sakshi

రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న బిగ్‌బాస్‌ సీజన్‌2 షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బుధవారం జరిగిన షోలో రెండు టీమ్‌లు బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో పోటీపడటం ఆసక్తికరంగా మారింది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు నిన్నంతా బిగ్‌బాస్‌ హౌస్‌లో కథంతా డబ్బు చుట్టే జరిగింది. ఆ డబ్బును చేజిక్కించుకుని కంటెస్ట్‌గా గెలవాలని తేజస్వీ, కంటెస్టెంట్‌తో పాటు తన టీమే గెలవాలని కౌశల్‌ టీం ఆడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. 

చివరగా కంటెస్టెంట్‌గా తేజస్వీ గెలవగా.. కౌశల్‌, సామ్రాట్‌ టీమ్స్‌లో కౌశలే విజయం సాధించాడు. గెలిచినందుకు వీరిద్దరికి బిగ్‌బాస్‌ అభినందనలతో పాటు, ఓ ప్రత్యేకమైన ఓటు హక్కును బహుమతిగా ఇచ్చాడు. సందర్భం వచ్చినప్పుడు ఆ ఓటు హక్కు గురించి వివరిస్తానని బిగ్‌బాస్‌ వారికి తెలిపాడు. ఇక నేటి షోలో ఇంటి సభ్యులందరూ హుషారుగా ఉన్నట్టున్నారు. కెవ్వు కేక సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ.. కేక పుట్టిస్తున్నారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో రూల్స్‌ను పాటించడం లేదనీ, ఈ విషయంపై ఓ ఇద్దరిని బిగ్‌బాస్‌ శిక్షిస్తున్నాడంటూ ఓ ప్రోమోను విడుదల చేశారు. మరి ఆ ఇద్దరు ఎవరో, వారికి విదించిన శిక్షలేమిటో తెలియాలంటే నేటి కార్యకమ్రాన్ని వీక్షించాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement