బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమ.. ఇప్పుడు నిశ్చితార్థం

Bigg Boss Kannada 5 Contestants Chandan Shetty And Niveditha Gowda to Get Engaged - Sakshi

మైసూరు : కన్నడ బిగ్‌బాస్‌ కంటెస్టంట్లు చందన్‌శెట్టి, నివేదిత గౌడ సోమవారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిశ్చితార్థం చేసుకొని బిగ్‌బాస్‌ హౌస్‌లో తమ మధ్య చిగురించిన ప్రేమను మరోమెట్టుకు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొన్న గాయకుడు చందన్‌శెట్టి, నివేదిత గౌడ షో ముగిశాక బయట కూడా చెట్టపట్టాలేసుకొని తిరగడంతో ఇరువురి మధ్య ప్రేమాయణం జరుగుతోందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా దసరా ఉత్సవాల్లో పాల్గొన్న చందన్‌శెట్టి అదే కార్యక్రమంలో పాల్గొన్న నివేదితకు ప్రేమ వ్యక్తపరచగా దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top