బిగ్‌బాస్‌ రీయూనియన్‌: రాహుల్‌ ఏమయ్యాడు?

Bigg Boss 3 Telugu Winner: Rahul Sipligunj Absent Reunion  - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు 3..  అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఎంతగానో క్రేజ్‌ తెచ్చిపెట్టింది. చాలామందికి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇక రాహుల్‌ చేజారిన రాములో రాములా పాట మరోసారి అతనితో పాడించాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాహుల్‌.. ఆర్‌ఎక్స్‌100 ఫేమ్‌ హీరో కార్తీకేయ నటిస్తున్న 90 ఎమ్‌ఎల్‌ చిత్రంలో ‘సింగిల్‌ సింగిల్‌’ పాడారు. దీనికి యూట్యూబ్‌లో మంచి ఆదరణే లభిస్తోంది. అలా బిగ్‌బాస్‌ విజేత రాహుల్‌ వరుస ఇంటర్య్వూలు, పాటలతో బిజీ అయిపోయాడు. కాగా మరోవైపు బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్లు రీయూనియన్‌ పేరిట గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కలర్‌ఫుల్‌ డ్రెస్సులతో మాంచి కిక్‌ ఇచ్చే పార్టీ నిర్వహించుకున్నారు. ఇందులో హిమజ, మహేశ్‌, పునర్నవి, వరుణ్‌, వితిక, అలీ, అతని భార్య మసుమా హాజరయ్యారు. కేక్‌ కటింగ్‌లు, డ్యాన్సులు, ఫొటోలకు ఫోజులు.. అబ్బో చాలానే ఎంజాయ్‌ చేశారు.

వరుస ఫొటోషూట్‌లు చేస్తున్న బిగ్‌బాస్‌ జంట
బిగ్‌బాస్‌ పూర్తయ్యాక వరుణ్‌, వితికలు వరుస ఫొటో షూట్‌లతో అభిమానులను ఏదో విధంగా అలరిస్తూనే ఉన్నారు. బిగ్‌బాస్‌తో బాగా ఫేమస్‌ అయిన పునర్నవి తన తదుపరి సినిమాలపై దృష్టి సారించింది. మరోవైపు రాహుల్‌.. తనను గెలిపించిన అభిమానుల కోసం నగరంలో లైవ్‌ కన్సర్ట్‌ ఏర్పాటు చేయనున్నాడు. ఈ నలుగురి గ్రూప్‌కు బయట మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే రీ యూనియన్‌ పార్టీలో ఒకరు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో పార్టీ ఎంజాయ్‌ చేసినప్పటికీ మనసులో ఉన్న వెలితిని పునర్నవి సోషల్‌ మీడియాలో బయటపెట్టింది. మిస్‌ యూ రాహుల్‌ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పార్టీకి చాలామందే డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బిగ్‌బాస్‌ గ్యాంగ్‌ మాత్రం రచ్చరచ్చ చేసింది.

రాహుల్‌, పునర్నవి మధ్య ఏముంది?
రాహుల్‌, పునర్నవిలను ఎన్నో వెబ్‌సైట్లు, టీవీ చానళ్లు మొదటగా అడిగే ప్రశ్న.. మీ మధ్య ఏముంది అని? దీనికి పునర్నవి కేవలం ఫ్రెండ్స్‌ మాత్రమే అంటూ వారిపై వచ్చే రూమర్స్‌ను కొట్టిపారేసేది. రాహుల్‌ మాత్రం పునర్నవి తనకు ఫ్రెండ్‌ కన్నా ఎక్కువ అని చెప్పేవాడు. పైగా అప్పట్లో వీరి పెళ్లి జరగబోతుంది అంటూ బయటకు వచ్చిన వార్తలు సంచలనాన్ని సృష్టించాయి. తాజాగా ఓ ప్రముఖ టీవీ షోకు వీరిద్దరూ కలిసే వెళ్లారంటే బయట వీళ్లకున్న క్రేజ్‌ ఏపాటిదో అర్థమవుతోంది. ఇక బిగ్‌బాస్‌ పూర్తయ్యాక పీవీవీఆర్‌ బ్యాచ్‌ కలిసి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top