బిగ్‌బాస్‌: వితిక చెల్లి ఎంట్రీ.. మా వాళ్లెప్పుడొస్తారో!

Bigg Boss 3 Telugu Vithika's Sister Rithika Entered The House - Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో నామినేషన్‌ చిచ్చు చల్లారలేదు. మాటల యుద్ధానికి దిగిన కంటెస్టెంట్లు ఇంకా దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ‘నన్ను కంత్రి అని నోరు పారేసుకున్నాడు. టివిలొ మా ఆయన చూస్తే ఫీల్‌ కాడా? తనకొక్కడికే పెళ్లాం ఉందా?’ అంటూ శివజ్యోతి ఏడ్చింది. ఇక నామినేషన్‌ ప్రక్రియ వరుణ్‌, రాహుల్‌ స్నేహానికి ఎసరు పెట్టినట్టు కనిపిస్తోంది. పునర్నవి వెళ్లినప్పటి నుంచి రాహుల్‌ కాస్త దూరంగా ఉంటున్నాడని, తనలో మార్పు గమనిస్తున్నానని వరుణ్‌ అభిప్రాయపడ్డాడు. ఇక బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా వారి పనితనంతో హోటల్‌కు సెవన్‌ స్టార్‌ సంపాదించి పునర్వైభవాన్ని తీసుకురావాలని ఆదేశించాడు. హోటల్‌ మేనేజర్‌ వరుణ్‌.. వంట మాస్టర్లుగా బాబా భాస్కర్‌, శ్రీముఖి, వితిక, హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్‌గా అలీ, శివజ్యోతి, రాహుల్‌ పనిచేశారు. వీరందిరి చేత బిగ్‌బాస్‌ కొన్ని డ్రిల్స్‌ చేయించాడు.

మార్చ్‌.. ఆగకుండా శుభ్రం చేయడం.. ఫ్రీజ్‌ అవటం.. ఉన్నచోటే నిద్రపోవడం.. పాట వచ్చినప్పుడు డాన్స్‌ చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇలా కాసేపు ఇంటి సభ్యులతో ఆడుకున్న బిగ్‌బాస్‌.. తర్వాత ఒక్కొక్కరి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించాడు. ముందుగా వితిక చెల్లెలిని ఇంట్లోకి పంపించగా.. ఆమె బావగారూ అంటూ పరుగెత్తుకెళ్లి వరుణ్‌ను హత్తుకుంది. చెల్లెలు రితికను చూడగానే వితిక బోరున ఏడ్చింది. వితికను ఊరడిస్తూ.. చాలా బాగా ఆడుతున్నావ్‌ అంటూ ఆమెకు ధైర్యాన్ని నూరిపోసింది. టాస్క్‌లో మరింత పర్‌ఫార్మ్‌ చేస్తే బాగుంటుంది అంటూ వరుణ్‌కు సలహా ఇచ్చింది. చివరగా వెళ్లిపోతూ హోటల్‌కు ఒక స్టార్‌ను ఇచ్చింది. తర్వాత అలీ రెజా భార్య మాసుమా ఇంట్లోకి అడుగు పెట్టింది. వచ్చీరాగానే అలీని హత్తుకుని విలపించింది. ఇక మావాళ్లు ఎప్పుడొస్తారో అంటూ మిగతా హౌస్‌మేట్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top