అలీ రెజా సూపర్ స్ట్రాంగ్ : రోహిణి

ఏడో వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ అయి ఇంటిబాట పట్టాడు అలీ రెజా. బిగ్‌బాస్ మూడో సీజన్‌లో విన్నర్‌గా నిలిచే అవకాశాలున్న కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న అలీ.. అనుకోకుండా ఎలిమినేట్ అయ్యాడు. ఆరువారాలుగా నామినేషన్‌ను ఫేస్ చేయకుండా ఉన్న అలీ.. ఇలా ఎలిమినేట్ అవడంతో హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్ కూడా షాక్‌కు గురయ్యారు. అయితే అలీ రెజాను తిరిగి హౌస్‌లోకి పంపించాలని అతని అభిమానులు కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్లతో హల్ చల్ చేస్తున్నారు.
అలీ రెజా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని, మాటలను అదుపులో పెట్టుకుని ఉంటే ఎలిమినేట్ అయ్యేవాడు కాదని అతని ఫాలోవర్స్ అనుకుంటున్నారు. అలీ ఎలిమినేషన్‌పై బిగ్‌బాస్ కంటెస్టెంట్ రోహిణి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రోహిణి తన పుట్టినరోజు సందర్భంగా.. కాసేపు నెటిజన్లతో ముచ్చటించింది. ఈమేరకు కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చింది.
అలీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవునా? కాదా?
సూపర్‌స్ట్రాంగ్.
అలీ ఎలిమినేషన్ కరెక్ట్ అనే భావిస్తున్నారా?
అవును ఎక్స్‌పెక్ట్ చేయలేదు.
రవి ఫైనల్ వరకు వెళ్తాడా?
బిగ్‌బాస్ హౌస్‌లో ఏదైనా జరగొచ్చు.
చాన్స్ వస్తే బిగ్‌బాస్‌కి మళ్లీ వెళ్తారా?
వెళ్దాం.
రాహుల్‌పై మీ అభిప్రాయం?
నోరు జారడం తప్పా మిగతాదంతా జెన్యూన్‌గా ఉంటాడు.
అలీ పేరెంట్స్ చనిపోయారా? అందుకే ఎలిమినేట్ చేశారా?
ఛీ ఛీ ఎవరు చెప్పారు.. అది తప్పుడు వార్త.
ఇలా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. శ్రీముఖి, రవి, బాబా భాస్కర్, తమన్నా, శివజ్యోతిలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను కూడా అడిగారు. వాటికి కూడా రోహిణి కూల్‌గా సమాధానమిచ్చింది. వాటికి సంబంధించిన సమాధానాలు కావాలంటే.. గ్యాలరీలో చూడండి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి