బిగ్‌బాస్‌: రీఎంట్రీ లేనట్టేనా..! | Bigg Boss 3 Telugu Re Entry Postponed | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: రీఎంట్రీ లేనట్టేనా..!

Sep 18 2019 12:21 PM | Updated on Sep 19 2019 2:03 PM

Bigg Boss 3 Telugu Re Entry Postponed - Sakshi

బిగ్‌బాస్‌ షోలో రీఎంట్రీకి బ్రేక్‌ పడింది. ఈ వారం రీఎంట్రీ ఉంటుందని అందరూ గట్టిగా నమ్మినప్పటికీ అవన్నీ వట్టి భ్రమలుగా మిగిల్చాడు బిగ్‌బాస్‌. కాగా షో మొదటినుంచి సోషల్‌ మీడియాలో చెప్పే జోస్యమే నిజమవుతూ వస్తోంది. షోలో ఎవరు పాల్గొంటారు అనే దగ్గర నుంచి ఎవరు ఎలిమినేట్‌ అవుతారు అనేవరకు అన్ని ముందుగానే లీక్‌ అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులకు ఎలాంటి సస్పెన్స్‌ లేక అసలైన మజా దొరక్క షో నీరసించిపోతోంది. మరోవైపేమో లీకువీరులు ఈసారి రీఎంట్రీ ఉంటుందని సోషల్‌ మీడియాలో దరువు వేసి మరీ చాటింపు చేశారు. పైగా ఈసారి నామినేషన్‌ ప్రక్రియ కూడా ఒక్కరోజులో పూర్తవకపోవటంతో ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్టయింది. ఇక ప్రేక్షకులు ఇంట్లోకి ఎవర్ని తిరిగి పంపిస్తే బాగుంటుందని చర్చోపచర్చలకు కూడా దిగారు.(చదవండి: నామినేషన్‌లో ఉంది వీరే)

ఈ సమయంలో బిగ్‌బాస్‌ అసలైన ట్విస్ట్‌ ఇచ్చాడు. కాస్త రూటు మార్చి సాధారణ నామినేషన్‌ ప్రక్రియను కొనసాగించి బిగ్‌బాంబ్‌ పేల్చాడు. ఎప్పటిలాగే ఎలిమినేషన్‌కు వెళ్లడంతో అంతా ఒక్కసారిగా నిట్టూర్పు విడిచారు. దీంతో సోషల్‌మీడియాలో వచ్చిన వార్తలపై నీళ్లు చల్లినట్టయింది. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా జరిగే రీఎంట్రీలో బిగ్‌బాస్‌ ఎవర్ని ఇంట్లోకి దింపుతాడనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు అలీరెజా తప్పకుండా ఆ లిస్టులో ఉంటాడని టాక్‌. కాగా బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌కార్డు ఎంట్రీలు ఇచ్చిన తమన్నా సింహాద్రి, శిల్ప చక్రవర్తిలు సరైన ఆటతీరు ప్రదర్శించే సమయం కూడా దక్కకముందే వెనుదిరిగారు. వీరిని తిరిగి తీసుకొచ్చినా పెద్దగా ఉపయోగం కూడా లేదని నెటిజన్లు భావిస్తున్నారు. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అలీరెజాను రీ ఎంట్రీ ఇప్పించడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగించిన బిగ్‌బాస్‌ రీఎంట్రీకి ఏ ముహూర్తాన్ని ఖరారు చేయనున్నాడో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement