బిగ్‌బాస్‌: టైటిల్‌ ఎగరేసుకుపోయిన రాహుల్‌!

Bigg Boss 3 Telugu: Rahul Sipligunj May Won Tiltle - Sakshi

బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ వందరోజులకు పైగా సాగింది. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో రికార్డులను తిరగరాస్తూ విజృంభించినప్పటికీ అదే దూకుడును షో ఆసాంతం కొనసాగించలేకపోయింది. అయితే బిగ్‌బాస్‌ అప్పుడప్పుడు ఇచ్చిన ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు.. రాహుల్‌, పునర్నవిల రిలేషన్‌షిప్‌ షోను గట్టెక్కించాయి. ఇన్నినాళ్ల బిగ్‌బాస్‌ జర్నీలో ఇంటి సభ్యులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మరెన్నో మధురానుభూతులను మిగుల్చుకున్నారు. కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. ఉన్న స్నేహితులు మరింత క్లోజ్‌ అయ్యారు. ఒకరినొకరు తెలుసుకున్నారు. అంతకుమించి వ్యక్తిగతంగా వారి బలాబలాలేంటో వారే క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు.

హోరాహోరీగా జరిగిన ఓటింగ్‌
ఇక బిగ్‌బాస్‌ అంతిమ ఘట్టానికి చేరుకుంది. అందరినీ దాటుకుంటూ, ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటూ అయిదుగురు ఇంటి సభ్యులు టాప్‌ 5లోకి అడుగుపెట్టారు. ఓట్లు వేయడానికి డెడ్‌లైన్‌ ముగియడంతో తీర్పు ఈపాటికే ఖరారైపోయింది. దీంతో లీకువీరులు విన్నర్‌ ఎవరో తేలిపోయింది.. అంటూ ఓ వార్తను ప్రచారం చేస్తున్నారు. ఓటింగ్‌లో దుమ్ము లేపిన రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి ఇంచుమించు సమానంగా ఉన్నప్పటికీ చివరాఖరకు వచ్చేసరికి మాత్రం రాహుల్‌కు విపరీతంగా ఓట్లు పోలయ్యాయని వారు అభిప్రాయపడ్డారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడని దండోరా వేస్తున్నారు.

కౌశల్‌, రాహుల్‌.. సేమ్‌ టు సేమ్‌
రాహుల్‌ గెలిచాడన్న విషయం తెలుసుకున్న చిచ్చా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రాహుల్‌ షో మొదటి నుంచి బద్దకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాస్క్‌లు సరిగా ఆడడని, ప్రతీదానికి గీవప్‌ అంటాడంటూ ఇంటి సభ్యులు 11సార్లు నామినేట్‌ చేశారు. విచిత్రంగా నామినేషన్లోకి వెళ్లిన ప్రతిసారీ రాహుల్‌దే పైచేయి అవుతూ వచ్చింది. దీంతో ఇంటి సభ్యులకు రాహుల్‌కు ఉన్న ఫాలోయింగ్‌ అర్థమైంది. పునర్నవితో పులిహోర కలుపుతున్నాడు అన్నవాళ్లే పున్ను ఎలిమినేట్‌ అయ్యాక రాహుల్‌ పూర్తిగా ఆటపైనే దృష్టిపెట్టి ఆడిన తీరు చూసి అతనికి ఓట్లు గుద్దేశారు. కాగా గత సీజన్‌లో విజేతగా నిలిచిన కౌశల్‌ కూడా 11 సార్లు నామినేట్‌ అవడం విశేషం.

రన్నర్‌గా శ్రీముఖి..?
మొన్నటివరకు టైటిల్‌ ఫేవరెట్‌గా ఉన్న శ్రీముఖి.. రాహుల్‌కు వచ్చిన ఓట్ల సునామీలో కొట్టుకుపోయిందని లీకువీరులు జోస్యం చెప్తున్నారు. అయితే షో ప్రారంభం నుంచి వాళ్లు చెప్పేవి దాదాపుగా నిజమవుతూ వచ్చినప్పటికీ కొన్నిసార్లు బొక్కబోర్లా పడ్డ సందర్భాలూ లేకపోలేదు. పైగా బిగ్‌బాస్‌ టీంలో శ్రీముఖిని సపోర్ట్‌ చేసేవారు ఉన్నారని, కనుక ఫలితాలను తారుమారు చేసే అవకాశాలు లేకపోలేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి బిగ్‌బాస్‌ 3 విజేత ఎవరో అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూద్దాం. (చదవండి: బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పిన కంటెస్టెంట్లు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top