
బిగ్‌బాస్ హౌస్‌లో గొడవ జరగని రోజు ఉంటుందా? అంటే చెప్పడం కష్టమే. ఇక వీకెండ్‌లో నాగార్జున వచ్చి ఎంటర్‌టైన్ చేసే టైమ్‌లో తప్పా మిగతా ఐదు రోజుల్లో ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు ఫైర్ అవుతునే ఉంటారు. అది టాస్క్‌లో భాగంగానే కావచ్చు.. నామినేషన్ ప్రక్రియలో భాగంగానే కావచ్చు... లేదా ఊరికే మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనూ గొడవలు కావచ్చు.
అయితే ముఖ్యంగా టాస్క్‌లు ఆడుతున్న సమయంలోనే ఈ గొడవలు జరగుతూ ఉంటాయి. ఎన్ని గొడవలు జరిగినా.. మళ్లీ అంతా ఒక్కటవుతారు అది వేరే విషయం. రాహుల్ నిన్న పాట పాడినట్లు.. ఎన్ని గొడవలు జరిగినా.. మళ్లీ అంతా ఫ్రెండ్స్‌లానే కలిసిపోతారు. నేటి నామినేషన్ ప్రక్రియ కోసం చేట్టిన టాస్క్ ఆసక్తి రేపేలా ఉంది. రాళ్లే రత్నాలంటూ పెట్టిన ఈ టాస్క్ హౌస్‌మేట్స్ మధ్య చిచ్చు రేపినట్లు కనిపిస్తోంది. టాస్క్ ఆడనంటూ మహేష్ తప్పుకుంటుండగా.. శ్రీముఖి అతడ్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. బాబా భాస్కర్‌కూడా సర్దిచెప్పేప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి చివరకు ఏం జరిగిందన్నది చూడాలి.