బిగ్‌బాస్‌.. కన్ఫెషన్‌ రూమ్‌లో కష్టపడుతున్నారేంటి?

Bigg Boss 3 Telugu Housemates Fun Moments In Confession Room - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో అన్నింటికంటే కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లడం కష్టమైంది. ఇంటిసభ్యులకు ఏదైనా పనిష్మెంట్‌ ఇవ్వాలన్నా.. సీక్రెట్‌ టాస్క్‌ ఇవ్వాలన్నా.. అలాంటి వాటికి కన్ఫెషర్‌ రూమ్‌ అడ్డాగా మారుతుంది. అందుకే ఆ రూమ్‌ అంటే అందరికీ దడగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం ఫుడ్‌ ఐటమ్స్‌ కూడా ఇస్తుంటాడు బిగ్‌బాస్‌. గత సీజన్‌లో తనీష్‌, రోల్‌ రైడా కన్ఫెషన్‌ రూమ్‌లో చాక్లెట్లు ఆరగించిన విషయం గుర్తుండే ఉంటుంది. నేటి ఎపిసోడ్‌లో కూడా అలాంటిదే జరగనున్నట్లు కనిపిస్తోంది.

నేటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులందర్నీ కన్ఫెషన్‌ రూమ్‌కు రావాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వెళ్లిన బాబా భాస్కర్‌ అక్కడ కూడా కన్‌ఫ్యూజ్‌ అవుతూ కనిపిస్తున్నాడు. ఇంగ్లీష్‌ రైమ్స్‌ చెప్పలేక పునర్నవి తడబాటు పడటం, రాహుల్‌ గుంజీలు తీయడం.. రవి-హిమజలకు తినే పదార్థాలను ఇవ్వడం.. వాటిని హిమజ దాచుకోవడం.. మీకు చెప్పింది తినమని.. దాచుకోమని కాదని బిగ్‌బాస్‌ అనడం హైలెట్‌గా నిలిచింది. ఇంతకీ ఇంటి సభ్యులందరు కన్ఫెషన​రూమ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top