డిన్నర్‌ పార్టీ ఇచ్చిన బిగ్‌బాస్‌

Bigg Boss 3 Telugu: Dinner Party To Housemates - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో శుక్రవారం నాటి ఎపిసోడ్‌ సందడిగా మారింది. కొందరికీ మంచి ఫుడ్‌ ఐటమ్స్‌ లభించగా.. మరికొందరికీ పనిష్మెంట్స్‌ లభించాయి. చివరకు అందరికీ బిగ్‌బాస్‌ డిన్నర్‌ పార్టీ ఇచ్చాడు. సీక్రెట్‌-లైస్‌ అని ఓ టాస్క్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. దాంట్లో ఇంటి సభ్యులందరూ గెలిస్తే.. డిన్నర్‌పార్టీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో కన్ఫెషన్‌ రూమ్‌లో జరిగిన వాటిని మిగతా హౌస్‌మేట్స్‌కు తెలియపర్చాలి. అయితే అవి నిజాలా? కాదా? అని ఇంటి సభ్యులు కనిపెట్టాలి. ఇలా వారు చెప్పినవన్ని నిజాలే అని గెస్‌ చేస్తే.. డిన్నర్‌ పార్టీ ఇవ్వనున్నట్లు తెలిపాడు.  

టాస్క్‌లో భాగంగా మొదటగా.. బాబా భాస్కర్‌ను కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచాడు. అనంతరం 1 నుంచి 100 వరకు, 100 నుంచి 1 వరకు లెక్కించమన్నాడు. ఏ నుంచి జెడ్‌ వరకు జెడ్‌ నుంచి ఏ వరకు చెప్పమన్నాడు. అయితే వీటిని చెప్పడంలో బాబా తడబడ్డాడు. హౌస్‌మేట్స్‌ దగ్గర ఏబీసీడీలు నేర్చుకోమ్మని సలహాఇచ్చాడు. ఇక బాబా భాస్కర్‌ తనకు కన్ఫెషన్‌ రూమ్‌లో బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ల గురించి చెప్పగా.. అవి నిజమేనని తమ నిర్ణయాన్ని తెలిపాడు.

రవి-హిమజలకు కేక్‌లు, చాక్లెట్లు ఇచ్చిన బిగ్‌బాస్‌.. వరుణ్‌-వితికాలను ఏకాంతంగా మాట్లాడుకునే వీలును కల్పించాడు. పునర్నవి నర్సరీ రైమ్స్‌, శివజ్యోతి తెలుగు పద్యాలను పాడారు. రాహుల్‌ విషయంలో మాత్రమే ఇంటి సభ్యులు పప్పులో కాలేశారు. అయితే శ్రీముఖి ప్రదర్శించిన అత్యుత్సాహం వల్లే నిజాన్ని కనుక్కోలేకపోయారు. దీంతో వరుణ్‌-శ్రీముఖి మధ్య మాటల యుద్దం జరిగింది. చివరకు ఇరువురు క్షమాపణలు చెప్పుకున్నారు.

ఇక శ్రీముఖికి నాగ్‌ ఫోటోను ఇచ్చి మాట్లాడుకోమన్నాడు.. శిల్పాకు తన భర్త ఫోన్‌ చేశాడని అబద్దం చెప్పమని అన్నాడు. కానీ ఇంటి సభ్యులు పసిగట్టేశారు. ఇక అందరి టాస్కుల్లోకెల్లా.. మహేష్‌కు ఇచ్చిన టాస్క్‌ కాస్త ఫన్నీగా అనిపించింది. అయితే అది అబద్దమని ఇట్టే పసిగట్టేశారు. అయినా మహేష్‌ నమ్మించేందుకు ప్రయత్నించినా.. ఎవ్వరు కూడా నమ్మలేదు. దీంతో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ డిన్నర్‌ పార్టీ ఇచ్చాడు. ఇక ఈ వారంలో ఎలిమినేట్‌ అయ్యేది ఎవరన్నది చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top