‘బిగ్‌ బాస్‌ 2’ వంద రోజులు | Bigg Boss 2 To Be 100 Days Long | Sakshi
Sakshi News home page

May 16 2018 2:01 PM | Updated on Jul 18 2019 1:45 PM

Bigg Boss 2 To Be 100 Days Long - Sakshi

ఉత్తరాదిలో ఘనవిజయం సాధించిన బిగ్‌బాస్‌ షో దక్షిణాదిలోనూ మంచి టీఆర్పీలు సాధించింది. ఈ షో తెలుగు వర్షన్‌ తొలి సీజన్‌కు ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సూపర్‌ హిట్ అయిన ఈ షో 70 రోజుల పాటు కొనసాగింది. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో రెండో సీజన్‌ను మరింత భారీగా ప్లాన్‌చేస్తున్నారు నిర్వాహకులు.

అయితే ఎన్టీఆర్‌ డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవటంతో రెండో సీజన్‌కు నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్‌ 2ను 100 రోజుల పాటు నిర్వహించనున్నారట. జూన్‌ 10 నుంచి రెండో సీజన్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. అదే రోజు షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలను వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement