బిగ్‌ బీ లేటెస్ట్‌ ట్వీట్‌..! | Big B reaches a collective 80 million followers | Sakshi
Sakshi News home page

బిగ్‌ బీ లేటెస్ట్‌ ట్వీట్‌..!

Dec 11 2017 1:58 PM | Updated on Oct 22 2018 6:02 PM

Big B reaches a collective 80 million followers - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌​ సూపర్‌స్టార్‌  మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (75)మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.  సోషల్‌ మీడియాలో ‘బిగ్‌ బీ ’ ఫాలోయర్స్‌  సంఖ్య  ఎనిమిది కోట్లకు చేరుకుంది. స్వయంగా అమితాబ్‌ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని  వెల్లడించారు.  80 మిలియన్ల ఫాలోయర్స్‌ అంటూ ఆయన ట్విట్‌ చేశారు.  దీంతో ట్విట్టర్‌లో సందడి నెలకొంది. అటు అభిమానులు, ఇటు వివిధ వర్గాలకు  పెద్దలు పలువురు అభినందలతో ముంచెత్తుతున్నారు.

 నాలుగు దశాబ్దాలుగా   బాలీవుడ్‌ సినీ రంగానికి విశేష సేవలందించిన  సీనియర్‌ నటుడు  బిగ్ బికి  ట్విట్టర్లో 31.7 మిలియన్లు,   ఫేస్‌బుక్‌ లో  27,731,622 మంది,  ఇన్‌స్టాగ్రామ్‌ లో 6.2 మిలియన్ల మంది  పాలోయర్స్‌ ఉన్నారు.    సోషల​ మీడియాలో  తరచూ చురుగ్గా ఉండే  అమితాబ్‌ ఖాతాలో ప్రస్తుతం రెండు  సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్‌ అమీర్‌ ఖాన్‌తో థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌,  రిషీకపూర్‌తో 102 నాట్ అవుట్‌  సినిమాల్ నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement