'షేక్ యువర్..' అంటూ దీపికతో స్టెప్పేసిన బిగ్ బీ! | Big B dances with Deepika Padukone, Arjun Kapoor to 'Bootiya' | Sakshi
Sakshi News home page

'షేక్ యువర్..' అంటూ దీపికతో స్టెప్పేసిన బిగ్ బీ!

Aug 28 2014 3:48 PM | Updated on Sep 2 2017 12:35 PM

'షేక్ యువర్..' అంటూ దీపికతో స్టెప్పేసిన బిగ్ బీ!

'షేక్ యువర్..' అంటూ దీపికతో స్టెప్పేసిన బిగ్ బీ!

త్వరలో విడుదల కానున్న 'ఫైండింగ్ ఫన్నీ' అనే చిత్రంలోని 'షేక్ యువర్ బుటియా' అనే పాటకు దీపికా పదుకోనే, అర్జున్ కపూర్ లతో కలిసి బీగ్ బీ అమితాబ్ బచ్చన్ స్టెప్పలేశారు.

ముంబై: త్వరలో విడుదల కానున్న 'ఫైండింగ్ ఫన్నీ' అనే చిత్రంలోని 'షేక్ యువర్ బుటియా' అనే పాటకు దీపికా పదుకోనే, అర్జున్ కపూర్ లతో కలిసి బీగ్ బీ అమితాబ్ బచ్చన్ స్టెప్పలేశారు. ఫైండింగ్ ఫన్నీ చిత్ర ప్రమోషన్ లో కోసం అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో దీపికా, అర్జున్ లు సందడి చేశారు. 
 
ఇప్పటికే యువతరాన్ని విశేషంగా ఆకర్సిస్తున్న  'షేక్ యువర్ బుటియా' అనే పాట 71 ఏళ్ల అమితాబ్ ను చిందేసేలా చేసింది. ఈ ఎపిసోడ్ షూటింగ్ తర్వాత బిగ్ బీ తన బ్లాగ్ లో ఫోటోలతోపాటు అనుభవాల్ని పంచుకున్నారు. సుజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12 తేదిన విడుదల కానుంది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement