సాహో హిందీ హక్కులు ఆయనకే | Bhushan Kumar to Present Saaho Film In Bollywood, Joins Hands With Producers | Sakshi
Sakshi News home page

Apr 17 2018 8:37 PM | Updated on Apr 17 2018 8:37 PM

 Bhushan Kumar to Present Saaho Film In Bollywood, Joins Hands With Producers - Sakshi

ప్రభాస్‌, భూషణ్‌ కుమార్‌

బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌కు హిందీ చిత్రసీమలోనూ అభిమానులు భారీగానే ఉన్నారు. వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా యూవీ క్రియేషన్స్‌ పతాకంలో సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా హిందీ హక్కులను బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ దక్కించుకున్నారు. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే అల్ట్రా మోడర్న్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని భూషణ్‌ అభిప్రాయ పడ్డారు. తనకు సినిమా హిందీ హక్కులు దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

‘ప్రభాస్‌ ఆలిండియా స్టార్‌గా ఎదిగారు. అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కుతున్న సాహోను హిందీ ప్రేక్షకులు తప్పక ఆదరిస్తార’ని భూషణ్‌ అన్నారు. ‘సినిమా మొదలైనప్పటి నుంచే ‘సాహో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగా మా సినిమా అభిమానులకు గొప్ప విజువల్ అనుభూతి అందిస్తుంద’ని ప్రభాస్‌ అన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ శ్రద్ధా కపూర్  హీరోయిన్‌గా, నీల్ నితీష్ ముకేష్, జాకీష్రాఫ్‌, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, చుంకీ పాండేలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్-ఎహషాన్-లాయ్ త్రయం సంగీతం అందిస్తోన్న సాహో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, సాహో హిందీ హక్కులను భూషణ్‌ కుమార్‌ ఎంత మొత్తానికి దక్కించుకున్నాడనేది వెల్లడి కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement