‘టీజర్‌, ట్రైలర్‌ కమింగ్‌ సూన్‌’ | Bhavya Creations O Pitta Katha Telugu Movie Pre Teaser Out | Sakshi
Sakshi News home page

విభిన్నంగా ‘ఓ పిట్టకథ’ ప్రీ టీజర్‌..

Feb 1 2020 11:21 AM | Updated on Feb 1 2020 11:22 AM

Bhavya Creations O Pitta Katha Telugu Movie Pre Teaser Out - Sakshi

ఇది మన సినిమా ట్రైలర్‌ కాదు. ఈ థియేటర్‌లో నెక్ట్స్‌ వచ్చే ట్రైలర్‌. మన సినిమా టీజర్‌, ట్రైలర్‌ కమింగ్‌ సూన్‌

చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ సంస్థపై ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ చేతుల మీదుగా విడుదల చేసిన చిత్ర ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర ప్రీ టీజర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. విభిన్నంగా రూపొందించిన ‘ఓ పిట్ట కథ’  ప్రీ టీజర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

47 సెకన్ల నిడివి గల ఈ ప్రీ టీజర్‌ ఆరంభంలో ఫుల్‌ యాక్షన్‌ సీన్స్‌ చూపించారు. దీంతో ఈ సినిమాలో టైటిల్‌కు భిన్నంగా, మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా హై వోల్టేజీ యాక్షన్‌ సీన్స్‌ రూపొందించరని భావిస్తారు. కానీ ‘ఇది మన సినిమా ట్రైలర్‌ కాదు. ఈ థియేటర్‌లో నెక్ట్స్‌ వచ్చే ట్రైలర్‌. మన సినిమా టీజర్‌, ట్రైలర్‌ కమింగ్‌ సూన్‌’ అంటూ చివర్లో చిత్ర బృందం ఇచ్చిన ట్విస్ట్‌ అదిరిపోయింది. 

అయితే ఈ సినిమాలో అలాంటి యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయా అనే విషయం తెలియాలంటే ఫిబ్రవరి 7వరకు వేచిచూడాలి. ఆ రోజు విడుదలయ్యే టీజర్‌తో ఈ సినిమాపై ఓ అభిప్రాయానికి రావచ్చు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది.
   

Advertisement
 
Advertisement
Advertisement