
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్
ముంబై : బాలీవుడ్ ప్రియాంక పెళ్లి వార్త మారుమోగుతోంది. ఇవ్వక ఇవ్వక రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌లో సల్మాన్‌తో ‘భారత్’ సినిమా చేయడానికి డేట్స్ ఇచ్చిన ప్రియాంక, ఒక్కసారిగా ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. స్పెషల్ రీజన్‌తోనే ప్రియాంక ‘భారత్’ నుంచి తప్పుకున్నారని ఆ సినిమా డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ ట్వీట్ చేశారు. ప్రియాంక, నిక్ జోనస్‌లను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారు. దీంతో ప్రియాంక ఇల్లాలు కాబోతుందని ఆమె అభిమానులందరూ సంబురపడిపోతున్నారు. ఆ సినిమా డైరెక్టర్ కూడా హ్యాపీగానే ట్వీట్ చేశారు. కానీ ఓ ఇద్దరు మాత్రం అన్‌హ్యాపీగా ఉన్నారట. ఎవరా? ఆ ఇద్దరూ అంటే. సినిమా నిర్మాత నికిల్ నమిత్, ప్రియాంకతో జోడి కట్టబోయే సల్మాన్ ఖాన్.
ఆమె హఠాత్తుగా సినిమా నుంచి తప్పుకోవడం, అనైతికమంటూ విరుచుకుపడుతున్నారు. ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నికిల్ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం తన ఎంగేజ్‌మెంట్ కారణంతో, భారత్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె తమతో చెప్పింది. ఇంత అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా అనైతికం అంటూ నిర్మాత విమర్శించారు. సల్మాన్ ఖాన్ కూడా ప్రియాంకపై కోపంగా ఉన్నారు. సడెన్‌గా భారత్ నుంచి ఆమె తప్పుకోవడంతో, మరోసారి ప్రియాంకతో వర్క్ చేయనంటూ సలూ భాయ్ కూడా తేల్చిచెప్పేశారట. భారత్ సినిమా డైరెక్టర్, ప్రియాంక స్నేహితుడు కావడంతో, ఎలాంటి వివాదాలు లేకుండా.. ఆమె తప్పుకోవడంపై సంతోషకరమైన ట్వీటే చేసినప్పటికీ.. సల్మాన్, నికిల్‌లు మాత్రం ప్రియాంక తీరుపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. నాన్‌సెన్స్... ఒకవేళ ఆమె పెళ్లి చేసుకోవాలని ఉంటే, భారత్ షూటింగ్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి. ఇదేమి చిన్న సినిమా కాదు అంటూ సల్మాన్ మండిపడ్డారట. ఇదిలా ఉంటే సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమాను కూడా ప్రియాంక ఒప్పుకున్నారు. మరి ఈ సినిమాలో నటించే విషయం గురించి కూడా ప్రియాంక ఏమైనా షాక్ ఇస్తారో? చూడాల్సి ఉంది.
కాగ, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ల ప్రేమ కథ 2017 మెట్ గలాలో మొదలైంది. నిక్ జోనస్, ప్రియాంక కంటే పదేళ్ల చిన్న. ఇటీవలే నిక్ జోనస్‌ను ప్రియాంక భారత్‌కు తీసుకుని వచ్చి, తన కుటుంబానికి పరిచయం చేసింది. నిక్ జోనస్ కూడా ప్రియాంకను వారి కుటుంబానికి పరిచయం చేయడంతో, వారి ప్రేమ కథకు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ పడినట్టు తెలుస్తోంది.