7న మహేశ్‌ బహిరంగ సభ! | Bharat Ane Nenu Movie Pre Release Event On 7th April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 7న మహేశ్‌ బహిరంగ సభ

Apr 1 2018 6:04 PM | Updated on Apr 1 2018 6:12 PM

Bharat Ane Nenu Movie Pre Release Event On 7th April - Sakshi

కొరటాల శివ, మహేశ్‌ బాబు కలయికలో రూపొందుతున్న చిత్రం భరత్‌ అనే నేను. ఈ చిత్రం విడుదలకు ముందే అంచనాలు ఆకాశాన్నంటాయి. భరత్‌ అనే నేను సినిమా ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ ఓత్‌, పాటలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. అయితే తాజాగా భరత్‌ బహిరంగ సభ అంటూ చిత్ర యూనిట్‌ ఒక పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 

అంటే రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి ఇలా ఆ రంగంలో ఉపయోగించే పదాలతో పబ్లిసిటీ ఇస్తున్నట్టు ఉంది చిత్రయూనిట్‌. ఏప్రిల్‌ 7న సాయంత్రం 6 గంటలకు ఎల్బీ స్టేడియంలో భరత్‌ బహిరంగ సభ అంటూ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను భరత్‌ బహిరంగ సభ అంటూ రిలీజ్‌ చేయడం మాత్రం కొత్తగా ఉంది. ఈ సభకు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లను అతిథులుగా విచ్చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘భరత్‌ అనే నేను’ ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement