రంగస్థలం రికార్డ్‌ బ్రేక్‌ చేసిన భరత్‌ | Bharat Ane Nenu Breaks Rangasthalam Record | Sakshi
Sakshi News home page

Apr 21 2018 10:49 AM | Updated on May 10 2018 12:13 PM

Bharat Ane Nenu Breaks Rangasthalam Record - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ డ్రామా భరత్‌ అనే నేను. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. పూర్తి లెక్కలు రాకపోయినా ఫస్ట్‌డే కలెక్షన్స్‌ 60 కోట్ల వరకు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే తమిళనాట మాత్రం ఈ సినిమా ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

తొలిరోజు రూ. 78 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్క చెన్నై సిటీలోనే రూ. 27 లక్షలకు పైగా గ్రాస్‌ సాధించి సత్తా చాటింది. ఇటీవల విడుదలైన రంగస్థలం రూ. 25 లక్షల రికార్డ్‌ను భరత్‌ అనే నేను 20 రోజులు తిరగకుండానే చెరిపేయటం విశేషం. మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మాజీ, రావు రమేష్‌లు ఇతర కీలక పాత్రలో నటించారు.

భరత్ అనే నేను మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement