‘భరత్‌’కు భారీ కలెక్షన్లు

Bharat Ane Nenu Box Office Collections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రిన్స్‌ మహేష్‌బాబు తాజా సినిమా ‘భరత్‌ అనే నేను’  బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. హిట్‌ టాక్‌ రావడంలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విదేశాల్లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. అమెరికాలో మొదటి వారంలో(‍ప్రివ్యూస్‌తో కలుపుకుని) ఈ సినిమా మూడు మిలియన్‌ డాలర్ల మార్కును దాటింది. అటు ఆస్ట్రేలియాలోనూ ‘భరత్‌..’  సందడి చేస్తున్నాడు. మొత్తంగా ఓవర్సిస్‌లో ఇప్పటికి 4 మిలియన్‌ డాలర్లను క్రాస్‌ చేసి ఐదు మిలియన్‌ డాలర్లకు పరుగులు పెడుతోందని ప్రముఖ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు.

కేరళలోనూ ఈ సినిమాకు ఆదరణ బాగుంది. మొదటి 5 రోజుల్లో రూ. 7.63 లక్షలు తెచ్చు​కుంది. ఈ సినిమా ఇప్పటికే రూ. 125 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించినట్టు చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. మహేష్‌బాబుకు జోడిగా కియారా అద్వాని నటించిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top