'స్పీడున్నోడు' జోరు చూపిస్తున్నాడు | bellamkonda sai srinivas busy with two films | Sakshi
Sakshi News home page

'స్పీడున్నోడు' జోరు చూపిస్తున్నాడు

Jan 8 2016 8:38 AM | Updated on Aug 3 2019 12:45 PM

'స్పీడున్నోడు' జోరు చూపిస్తున్నాడు - Sakshi

'స్పీడున్నోడు' జోరు చూపిస్తున్నాడు

అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్కి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. గతంలో మరే హీరో చేయని విధంగా భారీ బడ్జెట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్, తొలి సినిమాతో...

అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్కి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. గతంలో మరే హీరో చేయని విధంగా భారీ బడ్జెట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్, తొలి సినిమాతో నటుడిగా మెప్పించినా.., కమర్షియల్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని రెండేళ్ల విరామం తరువాత ఓ రీమేక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం రీమేక్ స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో స్పీడున్నోడు సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన సుందరపాండ్యన్ సినిమాకు రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరిదశలో ఉంది. తొలి సినిమా తరువాత రెండేళ్ల విరామం తీసుకున్న సాయి శ్రీనివాస్, రెండో సినిమా తరువాత మాత్రం గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. స్పీడున్నోడు సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.

సాయి శ్రీనివాస్ రెండో సినిమాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటించాల్సి ఉంది. కానీ అప్పట్లో హీరో మార్కెట్ దృష్ట్యా ఆ సినిమా వాయిదాపడింది. స్పీడున్నోడు సినిమా మీద ఉన్న నమ్మకంతో మరోసారి బోయపాటి సినిమాను లైన్లో పెట్టాడు సాయి. అంతేకాదు యంగ్ డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కూడా మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు పట్టాలెక్కిస్తాడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement