ఈ బ్యానర్‌లో మరెన్నో చిత్రాలు రావాలి | Bangari Balaraju Movie First Song Released by Nandamuri Kalyan Ram | Sakshi
Sakshi News home page

ఈ బ్యానర్‌లో మరెన్నో చిత్రాలు రావాలి

May 10 2018 12:43 AM | Updated on May 10 2018 12:43 AM

Bangari Balaraju Movie First Song Released by Nandamuri Kalyan Ram - Sakshi

రాఘవ్, కరోణ్య, కల్యాణ్‌రామ్, రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి, కోటేంద్ర

‘‘బంగారి బాలరాజు’ సినిమాలోని మొదటి పాట నా చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించి ఈ బ్యానర్‌లో మరెన్నో చిత్రాలు రావాలి. యూనిట్‌ మొత్తానికి మంచి పేరు రావాలి. ఆల్‌ ది బెస్ట్‌ టు ఎంటైర్‌ టీమ్‌’’ అని హీరో కల్యాణ్‌ రామ్‌ అన్నారు. రాఘవ్, కరోణ్య కత్రిన్‌ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’.  కె.యండి. రఫి, రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉంది. ఈ చిత్రం ఆడియోలోని తొలి పాటను కల్యాణ్‌ రామ్‌ విడుదల చేశారు.

కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ– ‘‘కల్యాణ్‌ రామ్‌గారు మా సినిమాకు సపోర్ట్‌ ఇవ్వడం మా యూనిట్‌కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మొత్తం 6 పాటలున్నాయి. మొదటి పాటను కల్యాణ్‌ రామ్‌గారు విడుదల చేయగా, మిగిలిన పాటలను వేరే ప్రముఖులతో రిలీజ్‌ చేయిస్తాం’’ అన్నారు రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి. రాఘవ్, కరోణ్య కత్రిన్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా : చక్రవర్తి, సంగీతం: చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు.

Advertisement
 
Advertisement
Advertisement