రాయలసీమ ప్రేమకథ

bangari balaraju movie first shedule completed - Sakshi

రాయలసీమలో జరిగిన ఓ వాస్తవ కథ ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమ కథతో రూపొందుతోన్న చిత్రం ‘బంగారి బాలరాజు’. రాఘవ్, కరాణ్య కత్రీన్, మీనాకుమారి, ‘దూకుడు’ శ్రవణ్, ఎన్‌.వి. చౌదరి, సారిక రామచంద్రరావు ప్రధాన పాత్రల్లో కోటేంద్ర దుద్యాలని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.ఎండి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ – ‘‘పరువు, ప్రతిష్టల మధ్య సాగే సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అహోబిలంలో మొదటి షెడ్యూల్‌ పూర్తయింది.

శాంతాబాయ్‌ పాటతో ఆకట్టుకున్న హాట్‌ బాంబ్‌ రాధికా పాటిల్‌తో స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరణ జరిపాం. మా చిత్రంతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం. గీతామాధురి పాడిన ఈ పాటకి రాధిక మరింత గ్లామర్‌ తీసుకొచ్చారు. ఈ నెలాఖరులో విడుదల చేసే టీజర్‌తో హీరో, హీరోయిన్‌లను పరిచయం చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘అనుకున్న టైమ్‌ కంటే త్వరగా పూర్తయింది. ఔట్‌పుట్‌ చూశాం. హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత రఫీ. ఈ చిత్రానికి సంగీతం : చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు, కెమెరా: జి.ఎల్‌. బాబు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top