
‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘కిల్, గ్యారా గ్యారా’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్ జుయల్ ‘ది ప్యారడైజ్’లో భాగమయ్యారు. ఈ విషయాన్ని ప్రకటించి, ఓ వీడియోతో రాఘవ్ జుయల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది యూనిట్.
‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘ది ప్యారడైజ్’ రూపొందుతోంది. నానీతో కలిసి మరో మరపురాని నటనను కనబరచడానికి రాఘవ్ సిద్ధంగా ఉన్నారు. హాలీవుడ్ స్టూడియోతో కలిసి పని చేయడం కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నాం’’ అని యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: సీహెచ్ సాయి.