మూడు రోజుల్లోనే రూ. 71.72 కోట్ల వసూళ్లు | Bang Bang movie crosses Rs.70 crore in three days | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లోనే రూ. 71.72 కోట్ల వసూళ్లు

Oct 5 2014 6:09 PM | Updated on Sep 2 2017 2:23 PM

మూడు రోజుల్లోనే రూ. 71.72 కోట్ల వసూళ్లు

మూడు రోజుల్లోనే రూ. 71.72 కోట్ల వసూళ్లు

హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తోంది.

న్యూఢిల్లీ: హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 70 కోట్ల మార్క్ దాటింది. ఒక్క మనదేశంలొనే మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 71.72 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల స్థాయిని దాటేసింది.

రూ.140 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'బ్యాంగ్ బ్యాంగ్'లో హృతిక్ కు జంటగా కత్రినా కైఫ్ నటించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement